Dulquer Salmaan: సీఎం రేవంత్ రెడ్డితో సినీ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రత్యేక భేటీ

Dulquer Salmaan: సీఎం రేవంత్ రెడ్డితో సినీ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రత్యేక భేటీ

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సినీ నిర్మాత స్వప్న దత్ సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ అయ్యారు. ఇవాళ (జులై20న) జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్‌ను శాలువ కప్పి సత్కరించారు. అయితే, ఈ ప్రత్యేక భేటీ.. సినిమా షూటింగ్కి సంబంధించిన పర్మిషన్ కోసమా? లేక ఏదైనా రాజకీయ కోణమా? అనేది తెలియాల్సి ఉంది.  

హీరో దుల్కర్ సల్మాన్.. ప్రస్తుతం తెలుగు, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి వరుస చిత్రాలతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇపుడీ మలయాళ స్టార్ దుల్కర్  ‘ఆకాశంలో ఒక తార’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తుండగా స్వప్న సినిమా మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అలాగే, 1950 మద్రాస్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ‘కాంత’ అనే మూవీ చేస్తున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్నాడు. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు.