
ఉస్తాద్ రామ్(Ustaad Ram), మాస్ డైరెక్టర్ బోయపాటి (Boyapati) కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ స్కంద (Skandha). లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి డుమ్మరే డుమ్మరే డుమ్మరే ఫ్యామిలీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సాంగ్ను లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి(Kalyanachakravarthy) రాయగా..అర్మాన్ మాలిక్, అయాన్ ప్రణతి పాడారు. ఫ్యామిలీ డ్రామాతో సాగే ఈ సాంగ్లో రామ్ మెలోడీ డ్యాన్స్తో ఆకట్టుకున్నారు. కోలమ్మ కోలో కొమ్మ గుమ్మంలో గువ్వ గువ్వ..కొండ కోనమ్మజెల్లో వాగమ్మపాతే మువ్వ మువ్వ..అలాగే, దుమ్మరే డుమ్మా దుమ్మరే సూటిగా ఉంటది మాటీరే..మట్టితల్లి బొట్టుగ మారే పచ్చదనలే పల్లెతురులే.. అంటూ రాసిన లిరిక్స్ అచ్చ తెలుగు మట్టి సువాసనను వెదజల్లుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ కు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి నుండి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా..శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.