ల్యాప్టాప్లు కొట్టేసి యాప్లో సేల్

ల్యాప్టాప్లు కొట్టేసి యాప్లో సేల్

హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈజీ మనీ కోసం చోరీలు చేస్తున్నారు.  ఇటీవల కొట్టేసిన బైకులు ఓఎల్ ఎక్స్ లో అమ్ముతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయగా...   ల్యాప్ టాప్ లు దొంగిలించి ఆన్ లైన్ లో అమ్ముతున్న ముఠాను ఇవాళ  దుండిగల్ పోలీసులు  అరెస్ట్ చేశారు.

ల్యాప్ టాప్ లు దొంగలించి వాటిని యాప్ ల ద్వార విక్రయిస్తున్న ఇద్దరు యువకులను ఇవాళ దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు .  నిందితులలో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్థి అపాలా బాలాజీగా గుర్తించారు.  యూపీకి చెందిన రాజ్ కుమార్ తో కలసి  బాలాజీ CASHIFY యాప్  ద్వార కొట్టేసిన ల్యాప్ టాప్ లను అమ్ముతున్నారు.  వీరి దగ్గర నుంచి 20 ల్యాప్ టాప్ లు,  23 పోన్లు, హోండా యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 10 లక్షల  వరకు ఉంటుందని అంచనా వేశారు. అపాలా బాలాజీ,రాజకుమార్ కృష్వా లను రిమాండ్ కు తరలించారు పోలీసులు.యాప్ డీలర్ మరో  నిందితుడు  పర్వేన్ కుమార్ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ దృష్ట్యా ఆన్ లైన్లో ల్యాప్ టాప్ లు కొనే వారు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు.