బాకీ డబ్బుల కోసం వాహనం దొంగతనం ..దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బాకీ డబ్బుల కోసం వాహనం దొంగతనం ..దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • ఐదుగురు అరెస్ట్​, రిమాండ్​కు తరలింపు

జీడిమెట్ల, వెలుగు: తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో బాధితుడి వాహనాన్ని దొంగలించిన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నారాయణపేటకు చెందిన మహేశ్, నర్సింహ దూరపు బంధువులు. నర్సింహ వద్ద మహేశ్ రూ. 2 లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా కొత్తగా బొలెరో వాహనం కొనుగోలు చేశాడు.

దీంతో ఆగ్రహించిన నర్సింహ..  తన స్నేహితులతో కలిసి ఆ వాహనాన్ని దొంగలించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 23న స్క్రాప్ అమ్ముతామని చెప్పి మహేశ్ ను ఓఆర్ఆర్ మల్లంపేట్ వద్దకు పిలిపించారు. అనంతరం బెదిరించి బొలెరో వాహనాన్ని లాక్కొని పరారయ్యారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నర్సింహ, కార్తిక్, విఘ్నేశ్, సాయి, పాశ్వాన్​ను గురువారం అరెస్ట్ చేశారు. బొలెరో వాహనంతోపాటు ఒక స్కూటీని స్వాధీనం  చేసుకున్నారు.