ఎమోషనల్ జర్నీ

ఎమోషనల్ జర్నీ

షారుఖ్‌‌ ఖాన్‌‌, రాజ్ కుమార్ హిరాణి కాంబోలో రూపొందిన  క్రేజీ ప్రాజెక్టు ‘డంకీ’. తాప్సీ హీరోయిన్‌‌. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం మూడో పాటను రిలీజ్ చేశారు. ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది.  నలుగురు స్నేహితులు విదేశాల్లో ఉంటూ.. స్వదేశంపై చూపించే ప్రేమను, వాళ్ల ఎమోషనల్ జర్నీని ఇందులో చూపించారు. ప్రీతమ్ కంపోజ్ చేసిన ఈ పాటకు జావేద్ అక్తర్ లిరిక్స్ రాయగా, సోనూ నిగమ్ పాడిన విధానం ఇంప్రెస్ చేస్తోంది.

 షారూఖ్‌‌, సోనూ నిగమ్ కాంబినేషన్‌‌లో వచ్చిన పాటలన్నీ సూపర్‌‌‌‌ హిట్ సాంగ్స్‌‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘డంకీ’తోనూ ఆ  మ్యాజిక్‌‌ను రిపీట్‌‌ చేశారు. బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని  జియో స్టూడియోస్‌‌, రెడ్ చిల్లీస్ ఎంట‌‌ర్‌‌టైన్మెంట్‌‌, రాజ్‌‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ సంస్థలు నిర్మించాయి.  డిసెంబర్ 21న సినిమా విడుదల  కానుంది.