నగరంలో భారీగా నకిలీ హెల్మెట్లు సీజ్

V6 Velugu Posted on Mar 23, 2021

శంషాబాద్‌లో డూప్లికేట్ హెల్మెట్లు అమ్ముతున్న పలు షాపులపై రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ పోలీసులు దాడులు చేశారు. ఐఎస్ఐ మార్కులేని నకిలీ హెల్మెట్స్‌ను అమ్ముతున్న షాపులపై దాడులు చేసి నాణ్యతలేని వందలాది హెల్మెట్లను సీజ్ చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. నాణ్యత లేని హెల్మెట్లు అమ్మకూడదని షాపుల యజమానులను ఎయిర్ పోర్ట్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. ప్రజలు కూడా తక్కువరేటుకు ఆశించకుండా.. నాణ్యత గల ఐఎస్ఐ బ్రాండ్ గల హెల్మెట్లు ధరించి ప్రమాదాల బారినుండి తమనుతాము కాపాడుకోవాలని సూచించారు. గత కొన్ని రోజుల నుంచి శంషాబాద్‌లో నాణ్యతలేని హెల్మెట్లు విచ్చలవిడిగా అమ్ముతుండటంతో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. నకిలీ హెల్మెట్లు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసి.. మరోసారి ఇలాంటి హెల్మెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Tagged Hyderabad, Telangana, Helmet, Accidents, Traffic Police, Vehicles

Latest Videos

Subscribe Now

More News