ఇయ్యాల ‘దుర్గం చెరువు రన్-2023’

ఇయ్యాల ‘దుర్గం చెరువు రన్-2023’
  • నేపథ్యంలో వెహికల్స్ దారి మళ్లింపు

గచ్చిబౌలి, వెలుగు: ఇనార్బిట్ మాల్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరగనున్న ది దుర్గం చెరువు రన్–2023 నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామన 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సుమారు 4,500 మంది 21కే, 10కే, 5కే రన్ లో పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.

ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా.. 

  •     కావూరిహిల్స్​, సీవోడీ జంక్షన్​నుంచి దుర్గం చెరువు మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్​కు  సైబర్ టవర్స్ జంక్షన్, లెమన్ ట్రీ జంక్షన్, ఐకియా అండర్ పాస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
  •     జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి కేబుల్​ బ్రిడ్జి మీదుగా బయోడైవర్సిటీ వైపు వెళ్లే వెహికల్స్.. మాదాపూర్ పీఎస్, సీవోడీ జంక్షన్, సైబర్​టవర్స్, లెమన్​ ట్రీ జంక్షన్, ఐకియా అండర్​పాస్ ​మీదుగా  చేరుకోవాలి. 
  •     ఐటీసీ కోహినూర్ రోడ్, సీ గేట్ రోడ్, ఐవోసీఎల్ రోడ్, మైహోం అబ్రా లేన్, స్కై వ్యూ లేన్, ఓరియన్ విల్లాస్ న్యూ రోడ్ తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 10 గంటల వరకు క్లోజ్ ఉంటుంది.
  •     ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రూట్లలో ఉదయం 11   హెవీ వెహికల్స్​కు పర్మిషన్ లేదు.