ఒకే సారి ఆరు ఉద్యోగాలు సాధించిన యువకుడు

ఒకే సారి ఆరు ఉద్యోగాలు సాధించిన  యువకుడు
  • ఎలగడప వాసికి ఆరు ఉద్యోగాలు

కడెం, వెలుగు : కడెం మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన దుర్గం రాజశేఖర్‌‌ ఒకే సారి ఆరు ఉద్యోగాలు సాధించి ప్రతిభ చాటాడు. దుర్గం లక్ష్మి, నర్సయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడైన రాజశేఖర్‌‌ ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ, ఎంటెక్‌‌ పూర్తి చేశాడు. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌‌ అయి 2023లో పలు పోటీ పరీక్షలు రాశాడు. ప్రస్తుతం ఆ పోటీ పరీక్షల రిజల్ట్‌‌ వెలువడడంతో రాజశేఖర్‌‌ మొత్తం ఆరు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు.

 ఈ నెల 2న విడుదలైన పంచాయతీరాజ్ ఏఈఈతో పాటు గతంలో విడుదలైన గ్రూప్‌‌ 4, టౌన్‌‌ ప్లానింగ్‌‌ బిల్డింగ్‌‌ ఓవర్సీస్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఇంజినీర్‌‌, జూనియర్‌‌ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాడు.  ఒకేసారి ఆరు ఉద్యోగాలు సాధించిన రాజశేఖర్‌‌ను పలువురు అభినందిస్తున్నారు. అయితే పంచాయతీరాజ్ శాఖలో ఏఈఈ ఉద్యోగంలో చేరనున్నట్లు రాజశేఖర్‌‌ తెలిపారు.