Dasara 2025: దుర్గాష్టమి ( సెప్టెంబర్ 30) .. ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి.. ఎలాంటి పరిహారం చేయాలి..

Dasara 2025:  దుర్గాష్టమి ( సెప్టెంబర్ 30) .. ఏ రాశి వారు  ఏ మంత్రం చదవాలి.. ఎలాంటి పరిహారం చేయాలి..

దసరా  నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం ఈఏడాది  దుర్గాష్టమి రోజున చంద్రుడు   ... గురుడు  రాశి  అయిన  ధనుస్సు రాశిలో ఉంటాడు.  అందువలన  దుర్గాష్టమి రోజున ప్రతి రాశి వారు కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు.   12 రాశుల వారు ఎలాంటి  పరిహరాలు చేస్తే దుర్గామాత   అనుగ్రహం రెట్టింపుగా లభిస్తుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

పురాణాల ప్రకారం దుర్గాష్టమి రోజు దుర్గాదేవి చీకటి, అహంకారంపై సాధించిన విజయాన్ని సూచిస్తుంది.ఈ రోజున మహా అష్టమి పూజ, సంధి పూజ, కన్యా పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.   జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు... ధనస్సు రాశిలో ఉన్న సమయం ఎంతో విశిష్టమైనది. దుర్గాష్టమి రోజు ఎంతో పవిత్రమైన రోజు.ఈ పవిత్ర సంగమం ప్రతి ఒక్కరూ ధైర్యంతో జీవించడం, సత్యాన్ని స్వీకరించడం,  భయాన్ని విడిచిపెట్టడం నేర్పే వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ రోజున ప్రతి రాశి వారు చేసే చిన్న నివారణలతో అమ్మవారి దయకు పాత్రులవుతారు.  ఒకే రోజు రెండు విశేషాలు ఉండటంతో ప్రతి ఒక్కరు వారి రాశి ఆధారంగా కొన్ని పరిహారాలు చేస్తే దుర్గామాత అనుగ్రహం రెండింతలు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

మేషరాశి:  ఈ రాశి వారు  ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని పఠించాలి. అమ్మవారిని బెల్లం నైవేద్యం సమర్పించండి.   ఎరుపు  లేదా సింధూరం రంగు వస్త్రాలు ధరించండి.  కొత్త అవకాశాలు కలుగుతాయి. 

వృషభ రాశి: ఈ రాశి వారు యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై అనే మంత్రాన్ని జపించండి. సూర్యస్తమయం సమయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి.. తెల్లటిపువ్వులతో అమ్మవారిని పూజించండి. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది.  అశాంతి తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. 

మిథున రాశి:  ఈ రాశి వారు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః  అనే మంత్రాన్ని జపించండి. అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రాలు సమర్పించి.. దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పించండి.  ఆలోచన తీరు మెరుగుపడుతుంది. జాతకంలో దోషాలు తొలగుతాయి. 

కర్కాటక రాశి: ఈ రాశి వారు దుర్గాష్టమి రోజున దుర్గా చాలీసా పారాయణం చేయండి.  ఎరుపు లేదా ఆకుపచ్చ అంచు ఉన్న తెల్ల రంగు వస్త్రాలు ధరించండి. అమ్మవారికి పచ్చి పాలు , తామర పువ్వును సమర్పించండి.  భావోద్వేగాలు తొలగి  కుటుంబ సభ్యుల్లో శాంతి తిరిగి నెలకొంటుంది

సింహ రాశి: ఈ  రాశి వారు ఓం కాత్యాయన్యై నమః అనే మంత్రాన్ని జపించి.. ఆడపిల్లను పూజించండి. ఎరుపురంగు బట్టలను  ఆ ఆడపిల్లకు ఇవ్వండి. పసుపు .. కుంకుమ తో పూజించి కాళ్లకు పారాయణి పెట్టండి. ఎర్ర మందార పువ్వులను అమ్మవారికి సమర్పించండి. సమాజంలో గౌరవం కలుగుతుంది. 

కన్య రాశి: ఈ రాశి వారు ఓం హ్రీం దుం దుర్గాయై నమః  అని జపించండి. పెసర పప్పుతో చేసిన ఆహారాన్ని అమ్మవారికి సమర్పించండి. పసుపు రంగు దుస్తులు ధరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

తుల రాశి: ఈ రాశి వారు ఓం చంద్రఘంటయే నమః అనే మంత్రాన్ని జపించి, లేత రంగు దుస్తులు ధరించండి.అమ్మవారికి తెల్ల గంధం సమర్పించండి. బెల్లంతో తయారు చేసిన పదార్దాలను నైవేద్యంగా సమర్పించండి.  శత్రువులపై విజయం సాధిస్తారు. 

వృశ్చిక రాశి:  ఈ రాశి వారు ఓం కాలరాత్య్రై నమః  అనే మంత్రాన్ని జపించి, ముదురు ఎరుపు రంగు దుస్తులను అమ్మవారికి సమర్పించండి.  ఆవనూనెతో దీపం వెలిగించి.. దుర్గా అష్టోత్తరంతో కుంకుమార్చన చేయండి. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న పాత సమస్యల నుంచి  విముక్తి పొందుతారు.

ధనుస్సు రాశి:  ఈ రాశి వారు ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని జపించి దుర్గా సప్తశతి చదవండి. పసుపు లేదా కుంకుమ రంగు బట్టలు ధరించండి.  కొత్త కొత్త ఆలోచనలు వచ్చి జీవితంలో స్థిరత్వం పొందుతారు. 

మకర రాశి: ఈ రాశి వారు ఓం మహాగౌర్యై నమః  అనే మంత్రాన్ని జపించండి. నీలిరంగు దుస్తులు ధరించండి.అమ్మవారికి చెరకు లేదా కొబ్బరికాయను సమర్పించండి.  ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

కుంభ రాశి:  ఈ రాశి వారు  ఓం స్కందమాతాయై నమః అనే మంత్రాన్ని జపించండి. అమ్మవారికి అరటి పండ్లను సమర్పించండి. నువ్వులను దానం చేయండి. మనసులో అశాంతి తొలుగుతుంది. 

మీన రాశి:  ఈ రాశి వారు ఓం సిద్ధిధాత్యై నమః  అనే మంత్రాన్ని జపించండి. లేత నీలం రంగు దుస్తులు ధరించండి అమ్మవారికి తులసి దళాలు సమర్పించండి.. పాయసం లేదా లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి.  ప్రతి విషయంలో కూడా మీదే పైచేయి అవుతుంది. అందరిని ఆకర్షిస్తారు.