అక్టోబర్ 19 నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు

అక్టోబర్ 19 నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25 వరకు ఇంటర్ బోర్డు దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 26న తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నట్లు బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్ని కాలేజీలు అకాడమిక్ షెడ్యూల్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఐఈఓలను ఆయన ఆదేశించారు. కాగా, ఈ నెల 13 నుంచి 25 వరకు అన్ని స్కూళ్లకు ప్రభుత్వం దసరా హాలీడేస్ ఇచ్చింది.