దసరా అయిపాయె.. ‘డబుల్​ బెడ్రూం’ రాకపాయె

దసరా అయిపాయె.. ‘డబుల్​ బెడ్రూం’ రాకపాయె

రెండు నెలల క్రితం అప్లికేషన్లు స్వీకరించిన ఆఫీసర్లు

16 వేల మంది లబ్ధిదారుల ఎదురుచూపు

నిర్మల్‍, వెలుగు: గడువుల మీద గడువులు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరడం లేదు. ఆరేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ ఊరించిన ప్రభుత్వం నిర్మాణాలు పూర్తైనా డబుల్​ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయడం లేదు. నిర్మల్‍ జిల్లాలో ఈ దసరాకు పంపిణీ చేస్తామని చెప్పి రెండు నెలల క్రితం అప్లికేషన్లు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పటివరకు లబ్ధిదారుల ఎంపిక కూడా కంప్లీట్​ చేయలేదు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు దసరా కానుకగా ఇండ్లు పంపిణీ చేస్తామని చెప్పి చివరకు నిరాశే మిగిల్చారు.

పంపిణీ ఎప్పుడో..

జిల్లాలో నిర్మల్‍ మున్సిపాలిటీ, నియోజకవర్గంలోని మండలాల్లో డబుల్‍ బెడ్‍రూంలు పంపిణీ చేస్తామంటూ ఆఫీసర్లు దసరాకు ముందు హడావుడి చేశారు. నిర్మల్​ మున్సిపాలిటీ పరిధిలో 1460, రూరల్​ పరిధిలో 1457 ఇండ్లు పూర్తయ్యాయని, ఇందుకోసం అప్లయ్​ చేసుకునేందుకు ఆఫీసర్లు సెప్టెంబర్‍ 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం నిర్మల్​ నియోజకవర్గంలో 16 వేలకు పైనే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత రెవెన్యూ ఆఫీసర్లతో సర్వే చేయించారు. ఇంటింటికి తిరుగుతూ అప్లయ్​ చేసుకున్న వారి పూర్తి వివరాలు సేకరించారు. డబుల్​ బెడ్‍రూంలకు ఎవరు అర్హులనే అంశంపై సర్వే మొదలు పెట్టిన ఆఫీసర్లు.. ఆ తర్వాత ప్రక్రియ మాత్రం ఆపేవారు. ఎలాగైనా దసరాకు ఇండ్లు పంపిణీ చేయాలంటూ హడావుడి చేసిన ఆఫీసర్లు ఇప్పుడు దీపావళి వస్తున్నా ఇండ్ల కేటాయింపులపై క్లారిటీ ఇవ్వడం లేదు. దరఖాస్తులు స్వీకరించిన ఇండ్లకు సంబంధించి ఇంకా ఇంటర్నల్​ వర్క్​ జరుగున్నాయని అధికారులు చెబుతున్నారు. రెండు నెలల నుంచి ఈ చిన్నపాటి పనులే పూర్తిచేయకపోవడం గమనార్హం. ఇప్పటివరకు జిల్లాలో 65 ఇండ్లు మాత్రమే గృహప్రవేశం జరిగాయి.

పంపిణీపై అనుమానాలు..

డబుల్‍బెడ్‍రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి స్పష్టం చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి సర్వే చేసిన ఆఫీసర్లు అర్హులైన వారిని గుర్తించాల్సి ఉంది. అయితే కొంతమంది లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిర్మల్​ మున్సిపాలిటీతో పాటు రూరల్​ ప్రాంతాల్లో అధికార పార్టీ లీడర్లు చెప్పిన వారికే ఇండ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తమ అనుమాయులకు ఇండ్లు కేటాయించేలా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

For More News..

ఐటీ పార్కు ప్లేస్‌‌లో పల్లీలు వేసుకుంటున్న రైతులు

మూడు నెలల్లో యాదాద్రి ఓపెన్​

హైదరాబాద్ శివార్లలో 2 వేల ఎకరాల్లో సినిమా సిటీ