పవన్ విమర్శలకు ఎమ్మెల్యే ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

పవన్ విమర్శలకు ఎమ్మెల్యే ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్

 పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా తాను సీనియర్‌ని అని.. కాకినాడ నుంచి పవన్, లోకేష్‌లలో ఎవరు పోటీకి ముందుకొచ్చిన తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే.. ఏమాత్రం చూస్తూ ఊరుకోననని, ఏ విషయంలోనూ తగ్గేది లేదని  పవన్ కు ద్వారంపూడి వార్నింగ్ ఇచ్చారు  తానేమీ అన్నయ్య పేరో, తండ్రి పేరో చెప్పి రాజకీయాల్లోకి రాలేదని.. స్వతహాగా ఈ స్థాయికి ఎదిగానని చురకలంటించారు. బీసీలకు తాము ఏం చేశామనే విషయంపై త్వరలో కాకినాడలో సభ పెడతామన్నారు.పవన్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే ఖండించనని, లేనిపోని ఆరోపణలు చేస్తే తప్పకుండా ఖండించడంతో పాటు ప్రశ్నిస్తానని తెలిపారు.గొడవల దగ్గర నుంచి కొట్టుకోవడం వరకూ తాను అన్ని చూశానన్న ఆయన.. కాకినాడలో కాంగ్రెస్ జెండాలు పాతి పాతి ఈ స్థాయికి వచ్చానన్నారు.