అంతర్జాతీయ క్రికెట్‎కు వీడ్కోలు ప్రకటించిన బ్రావో

అంతర్జాతీయ క్రికెట్‎కు వీడ్కోలు ప్రకటించిన బ్రావో

వెస్టిండీస్​ ఆల్​రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్​ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం దుబాయ్‎లో జరుగుతోన్న టీ20 ప్రపంచకప్​ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్​ అవనున్నట్లు తెలిపాడు. గురువారం అబుదాబిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఓటమి తర్వాత బ్రావో ఈ ప్రకటన చేశాడు.

‘వీడ్కోలుకు సమయం వచ్చేసింది. నా క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులతో 18 ఏళ్లుగా వెస్టిండీస్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. కరీబియన్​ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తా’ అని బ్రావో అన్నాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఫేస్‌బుక్ లైవ్‌లో బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు.

అయితే, టీ20 ప్రపంచకప్​లో సెమీస్​కు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేని శ్రీలంక జట్టు.. తన ఆఖరి గ్రూప్​ మ్యాచ్​లో అదరగొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్​లో వెస్టిండీస్​పై 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో విండీస్​ సెమీస్​ ఆశలపైనా నీళ్లు చల్లింది. లంక నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కరీబియన్ ఆటగాళ్లు విఫలమయ్యారు. 20 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు.