యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు

యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ ను ప్రారంభించిన మంత్రులు

నల్గొండ జిల్లా దామచర్లలో నిర్మించిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో  800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూనిట్‌ ను ఆగస్టు 1న మంత్రులు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. కాసేపట్లో రూ. 950 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు మంత్రులు

2015లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది  ఈ ప్రాజెక్ట్ ను టీజీ జెన్ కో నిర్మిస్తోంది. మొత్తం ఐదు యూనిట్లలో భాగంగా ఇవాళ తొలి యూనిట్ (800 మెగావాట్స్) ప్రారంభించారు.  

2028–29 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పవర్ డిమాండ్ 22,288 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ఈ ప్లాంట్ ద్వారా  2034–35 నాటికి 31,809 మెగావాట్ల విద్యుత్  ఉత్పత్తి చేయనుంది ప్రభుత్వం.