తైవానీస్​ ఎలక్ట్రానిక్​, హార్డ్​వేర్​ కంపెనీ ఏసర్ నుంచి ఈ–బైక్.. ధర రూ.లక్ష

తైవానీస్​ ఎలక్ట్రానిక్​, హార్డ్​వేర్​ కంపెనీ  ఏసర్ నుంచి ఈ–బైక్.. ధర రూ.లక్ష

హైదరాబాద్, వెలుగు: తైవానీస్​ ఎలక్ట్రానిక్​, హార్డ్​వేర్​ కంపెనీ ఏసర్​తో కలసి ‘మూవీ 125 4జీ’ ఎలక్ట్రిక్​ బైక్‌ థింక్​ ఈ–బైక్​ గో తీసుకొచ్చింది. సినీ నటుడు నిఖిల్​ సిద్ధార్థ దీనిని లాంచ్​ చేశారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. లక్ష. దీనిని డిజైన్ ​చేసి తయారు చేసింది తామేనని, ఏసర్​ టెక్నాలజీ పరమైన మద్దతును ఇచ్చిందని  థింక్ ఈ–బైక్ గో ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఏసర్ మూవీ 125 4జీ పట్టణ ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 

ఒక్కసారి చార్జ్​ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సాధారణ ప్రయాణికులతోపాటు హైపర్- లోకల్ ఫుడ్ డెలివరీ లేదా కిరాణా డెలివరీ వంటి వ్యాపారాలకూ అనువుగా ఉంటుందని తెలిపింది. ఇందులోని బ్యాటరీలను మార్చుకోవచ్చు. గ్రిప్​ బాగా ఉండటానికి 16 అంగుళాల వీల్స్​ అమర్చారు. 

డ్రైవర్​ అవసరాలకు తగ్గట్టుగా బైకును కస్టమైజ్​ చేసుకోవచ్చు. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.  దీనికి కేంద్ర, రాష్ట్ర-   ప్రభుత్వాల రాయితీలు వర్తిస్తాయి. బైక్​ యాక్సెసరీలను సులభంగా రిప్లేస్ చేయవచ్చని థింక్​ఈ–బైక్​ సీఈఓ డాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ చెప్పారు. సమీప భవిష్యత్తు లో ఈ–-సైకిళ్లు, ఈ–-బైక్‌‌లు, ఈ–-ట్రైక్‌‌లను లాంచ్​ చేస్తామని ప్రకటించారు.