సిగరెట్ దొంగలు: దుబాయ్ టు హైదరాబాద్ఈ-సిగరెట్లు ... అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురు అరెస్ట్

సిగరెట్ దొంగలు:  దుబాయ్ టు హైదరాబాద్ఈ-సిగరెట్లు ... అక్రమంగా రవాణా  చేస్తున్న  ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: దుబాయ్ నుంచి ఈ–-సిగరెట్లు, విదేశీ సిగరెట్లను హైదరాబాద్​కు అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని వెస్ట్​టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్​చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన అబ్దుల్లా శెట్టి, మెహదీపట్నంకు చెందిన మహమ్మద్ తాజుద్దీన్, గోల్కొండకు చెందిన హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్ వ్యాపారి మహమ్మద్ సమీ, రిటైలర్ మహమ్మద్ సోహైల్ ఖాన్, బోరబండకు చెందిన ఖలీల్ అహ్మద్, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మయాంక్ బిసే సిగరెట్లు రవాణా చేస్తున్నట్లు టాస్క్​ఫోర్స్​పోలీసులకు సమాచారం వచ్చింది. నిఘా పెట్టి గురువారం వారిని అరెస్ట్​ చేశారు. 6,800 సిగరెట్ ప్యాకెట్లు, 360 ఈ-–సిగరెట్లు సహా రూ.25 లక్షల విలువైన నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుపేర్కొన్నారు.