6 శాఖల్లో ఈ ఆఫీస్ విధానం అమలు..!

6 శాఖల్లో ఈ ఆఫీస్ విధానం అమలు..!

హైద‌రాబాద్: సీఎo కేసీఆర్ ఆదేశాల మేర‌కు పారదర్శక, జవాబుదారి పరిపాలన కోసం ఈ ఆఫీస్ సిస్టంను ప్రవేశ పెడుతున్నామ‌ని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నుండి 6 శాఖలలో ఈ ఆఫీస్ విధానం ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. 6 శాఖల్లో ఉన్న 1600 మంది ఉద్యోగులు ఈ విధానంలో పని చేయబోతున్నారని.. ఈ కొత్త విధానం మరింత పారదర్శకతకు తోడ్పాటవుతుందన్నారు. దీంతో అవసరంలేని పేపర్ వర్క్ కు.. అనవసర కాలయపనకు ఫుల్ స్టాఫ్ పెడుతుందన్నారు. దీనిద్వారా ప్రతి దరఖాస్తుకు జవాబు దారితనం ఉంటుందని.. వేగంగా ఫైళ్ల పరిష్కారం కోసం ఈ ఆఫీస్ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎస్ సోమేశ్‌ కుమార్‌ .

ఇప్పటికే జనరల్‌ అడ్మినిస్ర్టేషన్‌ (జీఏడీ), ఎక్సైజ్‌, కమర్షియల్‌ టాక్స్‌, సీసీఎల్‌ఎ, మహిళా శిశుసంక్షేమశాఖ ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మిగిలిన శాఖలు కూడా ఈ-ఆఫీస్‌ ద్వారా కార్యకలాపాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్. ఈ ఆఫీస్ విధానం అమలు చేయడంపట్ల ప‌లువురు ఉద్యోగులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.