ఇథనాల్ పెట్రోల్ (E20) మంచిదే..క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇథనాల్ పెట్రోల్ (E20) మంచిదే..క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇథనాల్ మిక్సడ్ పెట్రోల్(E20) పై వ్యతిరేకత వస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇథనాల్ మిక్సడ్ పెట్రోల్  వినియోగం  జాతీయ అవసరమని చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ డీజిల్ దిగుమతులను తగ్గించే క్రమంలో విదేశీ మార ద్రవ్యాన్ని ఆదా  చేసేందుకు లక్ష్యంగా E20 ని తీసుకొస్తున్నట్లు తెలిపింది. కొంతమంది వాహన యజమానులు మైలేజ్‌లో తగ్గుదల,ఇంజిన్ దెబ్బతినడం గురించి ఆందోళనలను వ్యక్తం చేస్తుండటంపై స్పందించిన పెట్రోలియం శాఖ.. అదంతా తప్పుడు ప్రచారం..అశాస్త్రీయం అని తోసిపుచ్చింది. 

E20 ముఖ్య ప్రయోజనాలు..

NITI ఆయోగ్, IOCL ,ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) వంటి సంస్థల అధ్యయనాల ద్వారా నిరూపించబడిన E20 ఇంధనం అనేక ప్రయోజనాలను ప్రభుత్వం హైలైట్ చేసింది. 

పర్యావరణ ప్రయోజనాలు..E20 ఇంధనం వాడకం కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు చెరకు,మొక్కజొన్న నుంచి తయారైన ఇథనాల్ పెట్రోల్‌తో పోలిస్తే గ్రీన్‌హౌస్ ,ఉద్గారాలను వరుసగా 65శాతం నుంచి 50శాతం వరకు తగ్గిస్తుంది. ఇది 2070 నాటికి నికర జీరో ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టడం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. 

ఆర్థిక ప్రయోజనాలు..భారతదేశ వినియోగంలో 85శాతం ముడి చమురు దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి పెట్రోల్‌తో ఇథనాల్ కలపడం ఒక వ్యూహాత్మక చర్య. ఇది ఏటా గణనీయమైన మొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేస్తుందని భావిస్తున్నారు.

►ALSO READ Viral video: సహనం కోల్పోయిన ఎంపీ జయబచన్..సెల్ఫీ విషయంలో ఓ వ్యక్తిపై ఆగ్రహం

రైతులకు మద్దతు..చెరకు, మొక్కజొన్న ,దెబ్బతిన్న ధాన్యాలు వంటి వ్యవసాయ పంటల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు. ఇది రైతులకు కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుంది.సకాలంలో చెల్లింపులను నిర్ధారిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది.E20 లక్షలాది మంది రైతులకు గేమ్ ఛేంజర్ గా మారనుంది. 

మెరుగైన ఇంజిన్ పనితీరు..E20 పెట్రోల్ వాడితే ఇంజన్ పాడవుతుందన్న ప్రచారం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే ఇథనాల్ పెట్రోల్ 84.4 కంటే ఎక్కువ ఆక్టేన్ సంఖ్య 108.5 ను కలిగి ఉంటుంది. ఇది ఆధునిక అధిక కంప్రెషన్ ఇంజిన్లకు చాలా ముఖ్యం.. భాష్పీభవనం అధికవేడి ఇంటెక్ మానిఫోల్డ్ ను చల్లబర్చేందుకు సాయపడుతుందని  ప్రభుత్వం చెబుతోంది. తద్వారా ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని అంటోంది. 

వాహన యజమానులు లేవనెత్తిన ఆందోళనలను ప్రభుత్వం నేరుగా ఇలా సమాధానం ఇచ్చింది. 

మైలేజ్ డ్రాప్.. పెట్రోల్ కంటే ఇథనాల్ తక్కువ శక్తి సాంద్రత కలిగి ఉందని అంగీకరిస్తూనే, మైలేజ్‌లో ఏదైనా తగ్గుదల స్వల్పమేనని ,తీవ్రమైనది కాదని మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇది E20 -అనుకూల వాహనాలకు 1-2శాతం,ఇతర వాహనాలకు 3-6శాతం తగ్గింపును అంచనా వేస్తుంది. అయితే దీనిని సరైన ఇంజిన్ ట్యూనింగ్‌తో తగ్గించవచ్చు.. డ్రైవింగ్ అలవాట్లు ,టైర్ ప్రెజర్ వంటి అనేక అంశాలు మైలేజీని ప్రభావితం చేస్తాయని మంత్రిత్వ శాఖ ఎత్తి చూపింది.