ఒక్కో కుటుంబం రోజుకు 500 రోటీలు అమ్ముతోంది

ఒక్కో కుటుంబం రోజుకు 500 రోటీలు అమ్ముతోంది

అహ్మదాబాద్​ జమల్​పూర్​లోని వాల్డ్​ సిటీలో ‘రోటీ లేన్​’ అనే గల్లీ ఒకటి ఉంది. అక్కడ ఏ గుమ్మం ముందు చూసినా.. ఆడవాళ్లు చకచకా రోటీలు చేస్తూ,  కాలుస్తూ కనిపిస్తారు. అది కూడా వందల నుంచి వేల సంఖ్యలో. ఎన్నో ఏండ్లుగా అదే వాళ్లకి జీవనోపాధి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘రోటీ లేన్’ అని పిలుస్తున్నారు. 

అహ్మదాబాద్​లో ఉన్న చాలా హోటళ్లు, రెస్టారెంట్​లు రోటీ లేన్​కు రెగ్యులర్​ కస్టమర్లు.  అలాగే చుట్టుపక్కల ఏ వేడుక జరిగినా రోటీలకి ఆర్డర్లు ఇక్కడికే వస్తాయి.  ఇలాంటి పెద్ద ఆర్డర్స్​ లేనప్పుడు రోడ్ల పక్కన రోటీలు పెట్టుకుని అమ్ముతుంటారు. ఇలా ఒక్కో కుటుంబం రోజుకు ఐదు వందల రోటీలు అమ్ముతుంటుంది. ‘‘ఆ ఆదాయంతోనే మా పిల్లల్ని చదివిస్తున్నాం. కుటుంబాన్ని పోషించుకుంటున్నాం’’ అని చెప్తున్నారు వీళ్లు. ఈ గల్లీలో 35 ఏండ్ల నుంచి రోటీలు అమ్ముతున్న కుటుంబాలు  కూడా ఉన్నాయి. ‘ ఈ బిజినెస్​ ఆలోచన ఎలా వచ్చిందని’ అడిగితే... ఈ గల్లీలో ఉండే  ఆడవాళ్లు ఇంటి ముందు స్టవ్​ పెట్టి రోటీలు కాల్చేవాళ్లట. అటుగా వచ్చి పోయేవాళ్లంతా.. అది చూసి, ‘అమ్ముతారా’?  అని అడిగేవాళ్లట. అలా  మొదట ఒకరిద్దరితో మొదలైన వ్యాపారం తర్వాత గల్లీ అంతటికీ బతుకుదెరువు అయింది.