
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 13న సినిమా విడుదల కానుంది. దీంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. ‘ఆడు మచ్చా’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
జాతర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈపాటలో రవితేజ బ్లాక్ షర్ట్, లుంగీ కట్టి, గడ్డం పెంచి డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ‘ఆయుధానికే ధైర్యం వీడే.. ఆగడాలనే ఆర్పేవీడే.. కాగడాలనే కాల్చే వాడే.. వేడి అంచులో వెలుగీడే’ అంటూ రవితేజ క్యారెక్టరైజేషన్‌ను పాట ద్వారా చూపించారు. దావ్‌జాంద్ ట్యూన్ చేయగా, కళ్యాణ్ చక్రవర్తి పవర్‌ఫుల్ లిరిక్స్ రాశాడు.
రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్‌గా పాడిన విధానం ఇంప్రెస్ చేస్తోంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌తో రవితేజ ఆకట్టుకున్నాడు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.