ఈగల్‌‌‌‌‌‌‌‌ సినిమాలో కొత్త తరహా మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తారు: డేవ్ జాంద్

ఈగల్‌‌‌‌‌‌‌‌ సినిమాలో కొత్త తరహా మ్యూజిక్ను ఎంజాయ్ చేస్తారు: డేవ్ జాంద్

సంగీత దర్శకుడిగా తొలిచిత్రమే రవితేజ లాంటి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరో సినిమాకు పనిచేయడం తన అదృష్టమని చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్.  రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా డేవ్ జాంద్ మాట్లాడుతూ ‘నా అసలు పేరు డేవిడ్ సందీప్. టెన్త్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌లోనే  క్రియేటివ్‌‌‌‌‌‌‌‌గా ఆలోచించి దేవ్ జాంద్ అని పెట్టుకున్నా.  ఫ్రీలాన్స్ మ్యూజిషియన్‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేసేవాడిని.  హీరో శ్రీవిష్ణు, నేను క్లాస్ మేట్స్.

తన ద్వారానే దర్శకుడు కార్తీక్‌‌‌‌‌‌‌‌ను కలిశా. తనకు నా ట్యూన్స్‌‌‌‌‌‌‌‌ వినిపించేవాడిని. ఆయన రాసుకున్న ప్రతి స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌కు నేను ముందే మ్యూజిక్ కంపోజ్  చేసేవాడిని. అలా రవితేజ గారి సినిమాకు ఆఫర్ వచ్చింది. ఇందులో చాలా కొత్త తరహా సంగీతం చేశాం. ‘ఈగల్ ఆన్ హిస్ వే’ అనేది కంప్లీట్ ఇంగ్లీష్ ట్రాక్. ఆయన సినిమాల్లో ఇదే ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాక్. ‘ఆడు మచ్చా’ పాట మాస్‌‌‌‌‌‌‌‌ని మెస్మరైజ్ చేస్తుంది.  ‘గల్లంతు’ పాట మనసుని హత్తుకునే మెలోడీ. రాబోతున్న నాలుగో ట్రాక్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ చిత్రంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది.  బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోరు విని అద్భుతంగా చేశానని రవితేజ గారు ప్రశంసించడం  చాలా తృప్తిని ఇచ్చింది. ఆయనతో మాట్లాడినపుడు చాలా ఇన్‌‌‌‌‌‌‌‌స్పైరింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు.