ఎంసెట్ పరీక్ష... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఎంసెట్ పరీక్ష... నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్ష ప్రారంభం కానుంది. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఎగ్జామ్.. రోజూ 2 సెషన్లలో జరుగుతుంది. ఎగ్జామ్​కు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ తెలిపారు. పరీక్ష టైమ్​ కంటే 2 గంటల ముందే సెంటర్లలోకి స్టూడెంట్లను అనుమతిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,72,241 మంది పరీక్షలు రాయనుండగా.. 108 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.