రేపటి నుంచి ఎంసెట్‌ ఎగ్జామ్స్‌

రేపటి నుంచి ఎంసెట్‌ ఎగ్జామ్స్‌

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎంసెట్‌  రేపు( శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 2,17,199 మంది స్టూడెంట్స్‌ హాజరు కానున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కంప్యూటర్‌ బెస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 94 కేంద్రాలను సిద్ధం చేశారు.

రోజూ రెండు విడతల్లో..

ఈనెల 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్‌ స్ర్టీమ్‌కు, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ర్టీమ్‌కు 8, 9 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు 1,42,218 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అబ్బాయిలు 87,804 మంది, అమ్మాయిలు 54,410 మంది, నలుగురు ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీలో 74,981 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అబ్బాయిలు 23,316 మంది, అమ్మాయిలు 51,664 మంది, ఒక ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండింటికీ 235 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలు రోజూ రెండు విడుతల్లో నిర్వహించనున్నారు.