
- టెక్నాలజీతో వ్యాధుల గుర్తింపు, చికిత్స సులభమైనయ్: తమిళిసై
- పేదలకూ టెక్నాలజీ అందుబాటులోకి రావాలె
- ట్రీట్మెంట్ల ఖర్చు తగ్గాలె
- బయో ఏషియా సదస్సు ముగింపు సభలో గవర్నర్
- సదస్సులో 2,800 మీటింగ్స్ జరిగాయ్: శ్రీధర్ బాబు
యంగ్ ట్యాలెంట్ బయటకొచ్చింది: మంత్రి
బయో ఏషియా సదస్సులో యంగ్ ట్యాలెంట్ బయటకొచ్చిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సదస్సులో 2,800 బిజినెస్ మీటింగ్స్ జరిగాయని, ఐదు ఫార్చూన్ 500 కంపెనీల సీఈవోలు కూడా హాజరయ్యారని తెలిపారు. పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు. లైఫ్‌సైన్స్ రీసెర్చ్ కోసం ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్)తో కలిసి సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్)ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో డేటా ఆధారిత హెల్త్ ఎకోసిస్టమ్ భివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు.
కాగా, బయోఏషియా సదస్సు సూపర్ సక్సెస్ అయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంతో పోలిస్తే స్టార్టప్‌లు, ప్రైవేటు వ్యక్తులు ఎక్కువమంది సదస్సుకు హాజరయ్యారని పేర్కొంది. 200 స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయని, 2,737 మంది డెలిగేట్స్, 700 మంది విజిటర్లు వచ్చారని తెలిపింది.
డబ్ల్యూఈఎఫ్ ‘హెల్త్ కేర్’ సెంటర్ ప్రారంభం
రాష్ట్రంలో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్)ను ఏర్పాటు చేశారు. హెల్త్‌కేర్ అండ్ లైఫ్‌సైన్సెస్‌పై ఫోకస్ పెట్టేలా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఈఎఫ్ దీనిని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్లు 19 ఉండగా.. హెల్త్‌కేర్ రంగంలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. సీ4ఐఆర్ ఏర్పాటయిన రోజే నాలుగు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు జరగడం విశేషం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, డిజిటల్ మెడికల్ సొసైటీ(డైమ్), గార్మిన్ హెల్త్, కాలిక్స్ ఏఐతో సీ4ఐఆర్ ఒప్పందం జరిగింది. హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ సెక్టార్లో నైపుణ్యాభివృద్ధి, సాఫ్ట్వేర్ మెడికల్ డివైజెస్, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ అనలిటిక్స్వంటి వాటిపై ఈ సెంటర్ దృష్టిపెట్టనుంది.