ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందస్తు సంబురాలు మొదలయ్యాయి. శనివారం హనుమకొండ కేయూసీ రోడ్డు హనుమాన్‌నగర్‌లోని ఏకశిల హైస్కూల్లో చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి, ప్రిన్సిపల్ బేతి శైలజారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కాజీపేట ఫాతిమా నగర్ లోని బాలవికాస పీపుల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ కు కెనడా దేశానికి చెందిన 15 మంది మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, సంక్రాంతి ముగ్గులు వేసి సందడి చేశారు.
బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి భారతీయ పండుగల గురించి కెనడా వాసులకు వివరించారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వాణి విద్యానికేతన్ స్కూల్లో సర్పంచ్ వానరాశి మౌనిక పాఠశాల కరస్పాండెంట్ గాజర్ల తిరుపతిశ్రీదేవిల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.- కేయూసీ/ కాజీపేట/ రేగొండ, వెలుగు
