తైవాన్లో భూకంపం..కుప్పకూలిన భవనాలు.. ఏప్రిల్ లోనే రెండుసార్లు

తైవాన్లో భూకంపం..కుప్పకూలిన భవనాలు.. ఏప్రిల్ లోనే రెండుసార్లు

తైవాన్ ద్వీపాన్ని భూకంపం వణికిస్తోంది. తాజాగా తైవాన్లో సోమవారం (ఏప్రిల్23) భూకంపం సంభవించింది. తైవాన్లోని తూర్పు కౌంటీ హువాలియన్ లో 5.5 తీవ్రతతో భూమి కంపించిందని తైపీ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సీస్మోలజీ సెంటర్ తెలిపింది. భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీలో భవనాలు కుప్పకూలాయి. భూకంపం 10 కి.మీ ల లోతులో సంభవించినట్లు తైవాన్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే రెండు సార్లు భూకంపం రావడంతో తైవాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

ఈనెల( ఏప్రిల్ నెలలో)లో తైవాన్లో భూకంపం రావడం ఇది రెండోసారి. ఏప్రిల్ 03 న హువాలియన్ లో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. 14 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వందల సార్లు భూమి కంపించింది. 

తైవాన్  భూకంపాలకు కొత్తేమి కాదు.ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ సమీపంలో ఉంది. 2016 లో కూడా దక్షిణ తైవాన్ లో భూకంపం వచ్చి 100 కి పైగా ప్రజలు మృతిచెందారు. 1999లో 7.3 తీవ్రతతో భూకంపం వచ్చి దాదాపు 2వేల మంది చనిపోయారు. తాజా భూకంపంతో 14 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

తైవాన్ ప్రాంతం చాలా అందమైన ప్రదేశాలున్నద్వీపం..ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో తక్కువ జనాభా కలిగిన తూర్పు తీరం వెంబడి ఉన్న ప్రాంతం. ఈ ప్రాం తం కఠిన పర్వతాలు, హాట్ స్ప్రింగ్ రిసార్ట్ లు, ప్రశాంతమైన పొలాలతో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది.