మణిపూర్‌లో భూకంపం .. బయటకు పరుగులు తీసిన జనం

మణిపూర్‌లో భూకంపం .. బయటకు పరుగులు తీసిన జనం

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో 2023 నవంబర్  05 ఆదివారం సాయంత్రం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం..  ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత: 3.1 గా ఉన్నట్లుగా వెల్లడించింది.  భూమి కంపించండంతో ప్రజలు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు తెల్లవారుజామున 1 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 3.6 తీవ్రతతో భూకంపం ఎన్‌ఎస్‌సి తెలిపింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది.