నేపాల్‌లో ఒక్కరోజే రెండుసార్లు భూకంపం

నేపాల్‌లో ఒక్కరోజే రెండుసార్లు భూకంపం

నేపాల్‌లో భూకంపం సంభవించింది.  2023 అక్టోబర్ ఆదివారం 22వ తేదీన  సాయంత్రం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ తెలిపింది. నేపాల్ లో అదివారం ఒక్కరోజే రెండుసార్లు భూకంపం సంభవించడం గమనార్హం.

ఈ రోజు ఉదయం ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంపం సంభవించింది.  భూకంపం 13 కిలోమీటర్ల లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.  

భూకంపం వలన ఎలాంటి ఆస్తి కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో నేపాల్‌ 11వ స్థానంలో ఉంది