ఆధార్ కార్డ్ పై ఫొటో చూపించలేకపోతున్నారా.. అయితే ఒక్క క్లిక్ తో చేంజ్ చేయండిలా

ఆధార్ కార్డ్ పై ఫొటో చూపించలేకపోతున్నారా.. అయితే ఒక్క క్లిక్ తో చేంజ్ చేయండిలా

ఆధార్ కార్డ్ కు ఇప్పుడు దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. బర్త్ సర్టిఫికెట్ మొదలు, బ్యాంక్ లావాదేవీలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు, పాఠశాల అడ్మిషన్లు, ఉద్యోగ ధృవీకరణలు వంటి ఎలాంటి ప్రయోజనాలకైనా ఇది అత్యంత అవసరం. ఇది లేకుండా ప్రభుత్వ సౌకర్యాలు పొందలేమంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంచనా వేయొచ్చు. అయితే, ఈ కార్డుపై ఉన్న ఫొటో పట్ల తమకున్న అసంతృప్తి కారణంగా చాలా మంది వ్యక్తులు తమ ఆధార్ కార్డును బహిరంగ ప్రదేశాల్లో చూపించడానికి ఇబ్బంది పడుతున్నారు, సంకోచిస్తారు.

ఆధార్ కార్డుపై ఉన్న ఫొటోను బేస్ చేసుకుని సోషల్ మీడియాలో మీమ్స్, కొన్ని సినిమాల్లో కామెడీ సీన్స్ కూడా వచ్చాయి. ఈ కారణంతో చాలా మంది తమ ఆధార్ కార్డుపై ఉన్న ఫొటోను చూపించేందుకు వెనకాడుతూ ఉంటారు. అయితే, దీనికి ఏ ఆధార్ సెంటర్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డ్ ఫొటోను సులభంగా, త్వరగా మార్చవచ్చు.

అంతే కాదు ఆధార్ సెంటర్‌లో క్యూలలో నిలబడాల్సిన అవసరం కూడా లేకుండా ఆధార్ కార్డ్‌లోని ఫొటోను సవరించవచ్చు. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అందించిన ఆన్‌లైన్ సౌకర్యాల ద్వారా ఈ ప్రక్రియను చాలా సులభంగా చేయవచ్చు.

ఆధార్ కార్డ్ పై ఉన్న ఫొటోను మార్చడానికి, ఈ కింది స్టెప్స్ ను ఫాలో అవండి:

  • UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • ఆధార్ సెక్షన్ కి వెళ్లండి.
  •  ఎన్ రోల్ ఫారమ్‌ అప్ డేట్ ఫారమ్ ను డౌన్‌లోడ్ చేయండి.
  • ఫారమ్‌లో అవసరమైన వివరాలను పూరించండి.
  • పర్మనెంట్ ఎన్ రోల్ సెంటర్ లో ఫారమ్‌ను సమర్పించండి.
  • అక్కడే మీ బయోమెట్రిక్ వివరాలను అందించండి.
  • ఈ ప్రక్రియ కోసం నామమాత్రపు రుసుము చెల్లించండి. సాధారణంగా దీనికి దాదాపు రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు.
  • URLని కలిగి ఉన్న సెంటర్ నుంచి రసీదు స్లిప్‌ను స్వీకరించండి.
  • కొన్ని రోజుల తర్వాత, మీ ఆధార్ కార్డ్‌లోని ఫొటో అప్‌డేట్ చేయబడుతుంది.
  • మనకు వచ్చిన URLని ఉపయోగించి ఫొటో మార్పు స్టేటను చెక్ చేయండి.

ఈ స్టెప్స్ ను ఫాలో అవడం ద్వారా ఆధార్ కార్డ్ పై ఫొటోను సులభంగా, సౌకర్యవంతంగా అప్‌డేట్ చేయవచ్చు. దీని వల్ల ఇప్పుడు కార్డ్‌ను ఎవరికైనా చూపించాల్సి వచ్చినపుడు సిగ్గుపడవలసిన, సందేహించాల్సిన అవసరం ఉండదు.