పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు

పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ల అరెస్ట్ ను బీజేపీ నేతలు  తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులు, అరెస్టులతో బీజేపీని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు . బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంబయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టులను ఖండించారు. ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు ఆందోళన చేసినందుకు అరెస్ట్ చేసిన 29 మందిని కూడా రిలీజ్ చేయాలన్నారు. 

కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బండి సంజయ్ అరెస్ట్ ను ఆమె ఖండించారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పాదయాత్ర చేస్తున్న సంజయ్ ను తీసుకెళ్లడం దుర్మార్గమన్నారు. అక్రమ కేసులు, అరెస్టులకు కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

బీజేపీ ఆదరణ ఓర్వలేకే

బండి సంజయ్, రాజా సింగ్ అరెస్టులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు . ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్నందుకే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

 బండి సంజయ్ అరెస్ట్

బీజేపీ కార్యకర్తల అరెస్ట్ కు నిరసనగా ఇవాళ ఉదయం  జనగామలో  ధర్మదీక్ష చేపట్టడానికి సిద్ధమైన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. కాగా బీజేపీ కార్యకర్తల అరెస్ట్ పై దుమారం కొనసాగుతోంది. కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసు పెడుతారా అని  బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దలు బండి సంజయ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. 

రాజాసింగ్ అరెస్ట్

తమను కించపరిచే విధంగా వీడియోలు అప్ లోడ్ చేశారని ముస్లీం నేతలు ఫిర్యాదు చేయడంతో రాజాసింగ్ ను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.  కేసు నమోదు చేసి ఆయన ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని.. తిట్టే వారికే విలువ ఉందన్నారు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్ ఫారూఖికి ఇచ్చి..షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.