చేతగానోడే దొంగదెబ్బ కొడ్తాడు

V6 Velugu Posted on Oct 17, 2021

వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని.. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. తనని ఓడించాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారే తప్ప... రైతుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదన్నారు. హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేటలో ఎన్నికల ప్రచారం చేశారు ఈటల.   హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప.. దౌర్జన్యానికి లొంగరని.. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో నిరూపిస్తారన్నారు. ఈటల రాజేందర్ అనే వాడు ఏకై మేకైండని..తనను ఖతం చేయాలని కుట్రలు చేస్తున్నాడన్నారు. తన మొహం అసెంబ్లీలో కనిపించకూడదని.. ప్రగతిభవన్ లో కూర్చుని  హరీశ్ కు కేసీఆర్ ఆదేశాలిచ్చాడన్నారు. వందల కోట్ల రూపాయలు, లారీల్లో లిక్కర్ సీసాలు, రాజస్థాన్ నుంచి పదివేల గొర్రెలు తెచ్చాడన్నారు ఈటల. చేతనైనోడైతే.. తమ గురించి చెప్పుకుని ఓట్లు అడుగుతాడని... చేతగానోడు దొంగదెబ్బ కొట్టాలని చూస్తాడు. 

Tagged KCR, Campaign, HarishRao, Eatala Rajender, huzurabad bypoll, Pothireddy Peta

Latest Videos

Subscribe Now

More News