డబ్బు సంచులకు ధర్మానికి మధ్యే పోరాటం

డబ్బు సంచులకు ధర్మానికి మధ్యే పోరాటం

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్ .అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన ఈటల..అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లెటర్ ఇచ్చానని చెప్పారు. కరోనాను అడ్డంపెట్టుకుని స్పీకర్ రాలేదన్నారు. గత్యంతరం లేక తన రాజీనామా లేఖను సెక్రటరీకి ఇచ్చానన్నారు. రాజీనామా తర్వాత స్వేచ్ఛగా ఉందన్నారు. అసెంబ్లీ గేటు దగ్గర తన సహచరులను అనుమతించలేదన్నారు. అసెంబ్లీలో సంప్రదాయాలు, చట్టాలను కూడా తుంగలో తొక్కారన్నారు. చిల్లర ప్రయత్నాలతో కేసీఆరే పలుచన అవుతారన్నారు. పెన్షన్లు ఇస్తామంటూ హుజురాబాద్ లో ప్రలోభ పెడుతున్నారన్నారు. టీఆర్ఎస్ కు ఓటేయకపోతే పథకాలు రావంటూ బెదిరిస్తున్నారన్నారు. డబ్బుసంచులకు ధర్మానికి మధ్యపోరాటం జరుగుతుందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలపై తన డీఎన్ఏ కూడా పోరాడుతుందన్నారు. తనకు నిర్భందాలు,అరెస్టులు కొత్తకాదన్నారు. కేసులు ఎదుర్కొని కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే తన లక్ష్యమన్నారు.