నియోజకవర్గ ముఖ్య నేతలతో ఈటల భేటీ

నియోజకవర్గ ముఖ్య నేతలతో ఈటల భేటీ

రాజకీయ భవిష్యత్ పై తన అనుచరులతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  పార్టీ మారాల వద్దా అనే దానిపై మాట్లాడుతున్నారు. పార్టీ మారితే ఎలా ఉంటుందని... తన అనుచరుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల లీడర్లను ఈటల కలిశారు. ఈ మధ్యే ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేతతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తన నివాసంలో... హుజురాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు.ఈటల కొత్త రాజకీయ పార్టీ పెడతారా? తన రాజకీయ భవిష్యత్తు ఏంటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.