
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈటల రాజేందర్‌కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈటల వెంట ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. TRS పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీలో చేరతారని సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన ఈటల.. మరో ఐదుగురు నేతలతో కలిసి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.