నా గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలి

నా గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలి

కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు మాజీమంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ లో ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారన్నారు. కేసీఆర్ అహంకారాన్ని,డబ్బు, మద్యం సీసాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు.   ప్రజలంతా ఏకమై కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు. తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని .. అమిత్ షా తనకు అండగా ఉంటానన్నారని చెప్పారు. అమిత్ షా, జేపీ నడ్డాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపును ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు ఈటల. తన గెలుపునకు కృషి చేసిన సోషల్ మీడియా టీంకు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుతో టీఆర్ఎస్ సిగ్గుపడాలన్నారు.  కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు విజయం సాధించారన్నారు. రాష్ట్రంలో ప్రజలు నిన్ననే దీపావళి పండుగ చేసుకున్నారన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు సంబరాలు జరుపుకున్నారన్నారు.  టీఆర్ఎస్ పిలిచి డబ్బులిచ్చినా ..ఓట్లు తనకే వేశారన్నారు ఈటల.

10 లక్షలు పది సార్లు ఇచ్చినా.. ప్రజలు ధర్మం వైపే నిలబడతానని చెప్పారన్నారు. పోలీసులు,ఎస్కాట్స్, అంబులెన్స్ ల్లో  డబ్బులు తెచ్చారన్నారు. తన లాంటి కష్టం పగొడికి కూడా రావొద్దన్నారు. వ్యాపారాలు వదులుకుని తాను తన భార్య ఇంటింటికి తిరిగామన్నారు.కుట్రదారులు ఎప్పటికైనా కుట్రల్లోనే పోతారన్నారు.  హుజురాబాద్ లో  రెండు గుంటల వ్యక్తి రూ.400 కోట్లు ఎలా ఖర్చు పెట్టారన్నారు.  తన చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. మోసం చేసింది..వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్ అని అన్నారు. మావ ,అల్లుళ్లకు సవాల్ చేస్తే రాలేదన్నారు. హుజురాబాద్ ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.