డబ్బులెక్కడివి తమ్మీ అని ఆనాడు అడగలేదు..ఇప్పుడు విమర్శలా?

డబ్బులెక్కడివి తమ్మీ అని ఆనాడు అడగలేదు..ఇప్పుడు విమర్శలా?

సమైక్య రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నామని.. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొంటామన్నారు ఈటల సతీమణి జమున. ఆస్తులు కాపాడుకోవడానికే తాము బీజేపీలో చేరామన్న విమర్శలు సరికాదన్నారు. 2000 సంవత్సరం కంటే ముందు నుంచే తమకు ఆస్తులు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమం నడపడానికి తాము చాలా ఖర్చు పెట్టామన్నారు జమున.  ఆరోజు ఎప్పుడూ కూడా తమ్మీ ఎక్కడినుండి డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నావని కేసీఆర్  అడగలేదన్నారు. కానీ ఈ రోజు విమర్వలు చేస్తున్నారన్నారు. నామినేషన్ వేసి ఇంట్లో ఉంటే గెలిపిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి, పంగిడిపల్లి గ్రామాల్లో పర్యటించారు జమున. వంగపల్లిలో మహిళలతో కలిసి జమున, తుల ఉమ ఆడిపాడారు.