కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తే నా అజెండా

V6 Velugu Posted on Jun 12, 2021

హుజురాబాద్ కురుక్షేత్రంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమే గెలుస్తుందన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల రాజేందర్..  ఎమ్మెల్యే గా ఓటమి లేకుండా 17 ఏళ్లుగా ప్రజలు గెలిపించారన్నారు. సమైక్య రాష్ట్ర పాలకుల మీద అసెంబ్లీలో గర్జించానన్నారు. ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. టీఆర్ఎస్ బీ ఫామ్ ఇచ్చి ఉండొచ్చు కానీ గెలిపించింది ప్రజలేనన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు మంత్రులుగా ఉన్నారన్నారు. జనాన్ని మాయ చేసి గెలుస్తున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వాన్ని జనం ఛీ  కొడుతున్నారని..అసహ్యించుకుంటున్నారన్నారు. కేసీఆర్ కుటుంబం, తెలంగాణ ప్రజలకు మధ్య ఘర్షణే హుజురాబాద్ బైపోల్ అని అన్నారు. వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఎలా గెలవాలా అని ప్రభుత్వం చూస్తోందన్నారు. వందల కోట్లతో తన కార్యకర్తలను,నాయకులను ఇబ్బందిపెడుతున్నారన్నారు. నిర్బంధాలను,బెదిరింపులను హుజురాబాద్ ప్రజలు తొక్క పడేస్తారన్నారు. కేసీఆర్ నుంచి తెలంగాణ విముక్తే తన అజెండా అన్నారు. కాసేపట్లో ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు.

Tagged TRS, MLA, KCR, ASSEMBLY, resign, Eatela Rajender, ganpark

Latest Videos

Subscribe Now

More News