కరివేపాకుతో బరువు తగ్గొచ్చు!

కరివేపాకుతో బరువు తగ్గొచ్చు!

ఫిట్​నెస్​ కోసం అప్పుడప్పుడు కాస్త కరివేపాకు కూడా తినాలి. ఎందుకంటే! కరివేపాకు వంట రుచికే కాదు... బరువు తగ్గించడానికి కూడా సాయపడుతుంది. ఈ విషయాన్నే ఫోర్టిస్​​ మెమోరియల్​ రీసెర్చ్ ఇని​స్టిట్యూట్​ క్లినికల్​ న్యూట్రిషనిస్ట్​ దీప్తి కతుజ చెబుతున్నారు.

 సీజన్​తో పనిలేకుండా అందరి వంటింట్లో ఉండేది సూపర్​ ఫుడ్​ కరివేపాకు. వంటల్లో కరివేపాకును ఫ్లేవర్​ కోసమే  వేస్తుంటారు అంతా. కానీ,  యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్​ పుష్కలంగా ఉండే కరివేపాకుతో ఇంకా బోలెడు లాభాలున్నాయి.  జర్నల్​ ఆఫ్​ చైనీస్​ మెడిసిన్​ ప్రకారం కరివేపాకు  రెగ్యులర్​గా తింటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్​ పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు డైజెషన్, కంటి చూపు కూడా బాగుంటుంది. ఎనీమియా..అంటే రక్తహీనత నుంచి  బయటపడొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే కరివేపాకు  తినడం వల్ల బరువు కూడా తేలిగ్గా తగ్గొచ్చు తెలుసా! పరగడపున కరివేపాకు తింటే... శరీరంలోని పేరుకుపోయిన కొవ్వు​ కరిగి మెటబాలిజం బూస్ట్​ అవుతుంది. దాంతో పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గొచ్చు. కరివేపాకులో మహానింబైన్​ అనే ఆల్కనాయిడ్​ ఉంటుంది. దానికి యాంటీ ఒబెసిటీ, లిపిడ్​ లోయరింగ్​ ఏజెంట్​ గుణాలు ఉంటాయి. ఇవి డైజెషన్​ సిస్టమ్​ని మెరుగు పరిచి బరువు తగ్గిస్తాయి. 

ఇలా తినాలి..

  •   కూర, పులుసు, శ్నాక్స్​ .. ఇలా రెసిపీ ఏదైనా సరే కరివేపాకు కలపాలి. ఒకవేళ పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడకపోతే కరివేపాకు పొడి చేసి కూరల్లో వేయాలి. 
  •   ప్రతిరోజూ పరగడుపున కరివేపాకుని నేరుగా తినడం లేదా నమలడం చేయాలి.
  •   కొన్ని కరివేపాకు రెమ్మల్ని నీళ్లలో మరిగించాలి. నీళ్లని వడగట్టి, అందులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి పరగడుపున తాగినా బరువు తగ్గుతారు.