పచ్చి బటానీలతో ఇమ్యూనిటీ

పచ్చి బటానీలతో ఇమ్యూనిటీ

ఇప్పుడు మార్కెట్లో పచ్చి బటానీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చిక్కుడు జాతికి చెందిన వీటిలో ప్రొటీన్లు, విటమిన్ ​– ఎ,కె తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి ఆరోగ్యాన్ని పెంచుతాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. పచ్చి బటానీలు తింటే లాభాలివి. వీటిలోని ల్యూటిన్, జియాగ్జాంతిన్​ అనే కెరోటినాయిడ్స్ కళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాటరాక్ట్​ బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు కంప్యూటర్​, ల్యాప్​టాప్, ఫోన్​ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్​ కారణంగా కళ్లు దెబ్బతినకుండా చూస్తాయి. 

  •   పచ్చి బటానీలోని ఫైబర్​..  ఫుడ్ ఈజీగా అరిగేలా చేస్తుంది. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. వీటిలోని ‘కౌమెస్ట్రోల్​’ అనే ఫైటో ఈస్ట్రోజన్​ స్టమక్​ క్యాన్సర్ రిస్క్​ని తగ్గిస్తుంది. 
  •   ఇందులోని ఒమెగా–3, 6 ఫ్యాటీ యాసిడ్స్​ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తాయి. పచ్చి బటానీలోని పొటాషియం, మెగ్నీషియం, హై బీపీని తగ్గిస్తాయి. 
  •   ఈ బటానీలో సి, ఇ విటమిన్లు, జింక్, కాటెచిన్, ఎపికాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.  
  •   ఎ, బి విటమిన్లు, ఫెరూలిక్​, కౌమెస్ట్రోల్​ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇన్​ఫ్లమేటరీ లక్షణాల్ని తగ్గిస్తాయి. దాంతో గుండె జబ్బులు, డయాబెటిస్​, ఆర్థరైటిస్​ ముప్పు నుంచి కాపాడతాయి.