వాతావరణం కాస్త చల్లగా ఉంటే... కాల్చిన పల్లీలపైకి లాగుతుంది మనసు. పోహా, పులిహోరల్లో పల్లీలే ఏరుకొని తింటుంటారు కొందరు. అయితే, ఏ ఫుడ్ అయినా మితిమీరి తింటే ఇబ్బందే అన్న సంగతి తెలిసిందే. ఆ సూత్రం పల్లీలకు కూడా వర్తిస్తుంది. పల్లీల్లో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువ. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా అనేక రోగాలకు పల్లీలు దారి తీస్తాయి. వీటిలో మోతాదుకు మించిన కేలరీలు ఉంటాయి. అలాగే ఫ్యాట్ ఎక్కువే. అందుకని వీటిని ఎక్కువ తింటే గుండెపోటు, జీర్ణ సమస్యలు, ధమనుల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
పల్లీల్లో కొవ్వు ఉండటంతో వాటిని ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. కొన్ని రకాలైన వేరుశెనగల్లో 170 కేలరీలు ఉంటాయని రీసెర్చర్లు చెప్తున్నారు. శరీరానికి రోజుకు 1600 నుండి 2400 కేలరీలు అవసరం.. అందుకని పల్లీలను స్నాక్స్‌గా తినాలి. వీటిలో ఫైటిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఇది శరీరానికి అందాల్సిన ఇనుము, జింక్, క్యాల్షియం, మెగ్నీషియంను అడ్డుకుంటుంది. ఫైటిక్ యాసిడ్ ఎక్కువ అయితే మినరల్స్ లోపం ఏర్పడుతుంది. దాంతో పేగుల్లో అలెర్జీలు వస్తాయి.
పల్లి గింజల్ని వేగించి లేదా ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకొని తినడం చాలా మందికి అలవాటు. అయితే వేగించిన ఉప్పు వేసిన పల్లీల్లో ఎక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. అవి తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకని ఉప్పు వేయని పల్లీలు తినడం బెటర్. పల్లీలు తినడం వల్ల అలర్జీలు ఎక్కువగానే వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా టేస్టీ పల్లీలను తయారు చేసేటప్పుడు అనేక రకరకాల పదార్థాలు కలవడం వల్ల క్రాష్ కంటామినేషన్ జరుగుతుందని డాక్టర్లు అంటున్నారు. దీని వల్ల దురద, శ్వాస సమస్యలు, డయేరియా వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు.
