శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎబోలా కలకలం..గాంధీ ఐసోలేషన్‌ వార్డుకు సూడాన్‌ వాసి తరలింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎబోలా కలకలం..గాంధీ ఐసోలేషన్‌ వార్డుకు సూడాన్‌ వాసి తరలింపు

పద్మారావునగర్, వెలుగు : సూడాన్‌ నుంచి శంషాబాద్ ​ఎయిర్​పోర్ట్​కు వచ్చిన సూడాన్​వాసికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఎబోలా స్టేట్‌ నోడల్‌ సెంటరైన గాంధీదవాఖానకు తరలించారు.  ఐసోలేషన్‌ వార్డులో డాక్టర్లు ట్రీట్​మెంట్ ​చేస్తున్నారు. 

సూడాన్‌ కు చెందిన మహ్మద్‌ యాహ్యా యాగోబ్‌ అహ్మద్‌(35) సిటీలోని ప్రైవేటు దవాఖానలో మోకాలి సర్జరీ కోసం ఈ నెల 3న రాత్రి ఎయిర్​పోర్టుకు వచ్చాడు. స్క్రీనింగ్‌ చేయగా జ్వరం ఉన్నట్లు తేలింది. దీనికి తోడు  ఎబోలా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ఉగాండాలోనూ పర్యటించినట్లు తేలింది. అతని శాంపిల్స్​ సీసీఎంబీకి పంపామని, అక్కడి నుంచి స్పెషల్​ఫ్లైట్​లో పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు తరలిస్తారని ఎబోలా స్టేట్‌నోడల్‌ ఆఫీసర్, గాంధీ జనరల్‌మెడిసిన్‌ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ సునీల్‌కుమార్  తెలిపారు.