పవన్ కళ్యాణ్ కు ఈసీ షాక్: 'గ్లాసు'కు చెక్ తప్పదా..!

పవన్ కళ్యాణ్ కు ఈసీ షాక్: 'గ్లాసు'కు చెక్ తప్పదా..!

పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే, పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా ఈ టీజర్ చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది. ఈ సినిమా టీజర్లో పవన్ కళ్యాణ్ పార్టీ గుర్తు గాజు గ్లాసు ప్రస్తావన ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో టీజర్లో పార్టీ గుర్తు ప్రస్తావన ఉండటం ఎన్నికల నియమానాల ఉల్లంఘన కిందకి వస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో గ్లాసు గుర్తు ప్రస్తావన ఉండటంపై స్పందించారు. ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందించిన ముకేశ్ కుమార్, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పార్టీ గుర్తును మీడియా ద్వారా ప్రచారం చేయటం ఎన్నికల నిబంధన ఉల్లంఘన అవుతుందని అన్నారు. పార్టీ గుర్తు మీద యాడ్స్ చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి అని, అలా అనుమతి లేకుండా మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ఇంకా చూడలేదని, చూసి ఆ టీజర్లో అభ్యంతరాలు ఉంటే తప్పకుండా నోటీసులు ఇస్తామని అన్నారు.

Also Read :పిఠాపురం బరిలో నేనే ఉంటా...