ఉచిత హామీలను అడ్డుకునే అధికారం మాకు లేదు

ఉచిత హామీలను అడ్డుకునే అధికారం మాకు లేదు

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు లేదా తర్వాత ప్రకటించే ఉచిత పథకాలను అడ్డుకునే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ వివరించింది. రాజకీయ పార్టీలు తీసుకునే ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మంచి చేస్తాయా? లేదా చెడు చేస్తాయా అనేది ఓటర్లే డిసైడ్ చేసుకోవాలని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్​లో పేర్కొన్నది. ఎన్నికల్లో గెలిచే రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో తీసుకునే విధాన నిర్ణయాలపై కలుగజేసుకునే పవర్ తమకు లేదని ఈసీ పేర్కొంది. ఎన్నికల్లో ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునేలా, అవసరమైతే గుర్తింపు రద్దు చేసేలా అధికారాల్లో మార్పులు చేయడానికి లా మినిస్ట్రీకి సూచనలు చేయాలని ఈసీ కోరింది.