చెక్‌‌పోస్టులన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌కి కనెక్ట్

చెక్‌‌పోస్టులన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌కి కనెక్ట్
  • డబ్బు, మద్యం పంపిణీపై ఈసీ ఫోకస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా  డబ్బు, మద్యం పంపిణీపై ఈసీ స్పెషల్ ఫోకస్‌‌ పెట్టింది. గత ఎన్నికలతో పోల్చేతే ఈసారి ఓటర్లను ఎక్కువగా ప్రలోభాలకు గురిచేసేందుకు రాజకీయ పార్టీలు, నేతలు ప్లాన్ చేసినట్లు ఈసీకి సమాచారం అందింది. దీంతో డీజీపీ అంజనీకుమార్, లా అండ్ ఆర్డర్‌‌‌‌ డీజీ‌‌ సంజయ్‌‌ జైన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగదు పంపిణీ, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 153 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 

చత్తీస్‌‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశాల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌‌పోస్టుల వద్ద సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేశారు. వీటిని స్థానిక జిల్లా హెడ్ క్వార్టర్స్‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్స్‌‌తో కనెక్ట్ చేశారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్‌‌ సెంటర్‌‌‌‌తో అనుసంధానం చేశారు. ఈ విధానంతో గ్రౌండ్‌‌ లెవల్‌‌లో జరుగుతున్న చెకింగ్‌‌ను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. చెక్ పోస్టుల వద్ద వెహికల్స్ చెకింగ్‌‌ సిబ్బంది పనితీరును కూడా పరిశీలించనున్నారు. తనిఖీల్లో లోపం ఉందని గుర్తించినా, చెక్ పోస్ట్‌‌ వద్ద ఇబ్బందులు తలెత్తినా సిబ్బందిని అప్రమత్తం చేస్తారు.