రాజకీయాలతో సంబంధం లేని డబ్బులను ఇచ్చేయండి : ఈసీ కీలక ఆదేశాలు

రాజకీయాలతో సంబంధం లేని డబ్బులను ఇచ్చేయండి : ఈసీ కీలక ఆదేశాలు

ఐదు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నది కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో పట్టుబడుతున్న డబ్బు కోట్లలో ఉంటుంది. డబ్బుతోపాటు బంగారం, వెండి వస్తువులు సైతం తనిఖీ దొరికి.. సీజ్ చేయబడుతున్నాయి. దీనిపై ఈసీకి వందల సంఖ్యలో కంప్లయింట్స్ వస్తున్నాయంట.. ఈ క్రమంలోనే కేంద్రం ఎన్నికల సంఘం.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. 

తనిఖీల్లో పట్టుబడి డబ్బులు, ఇతర ఆభరణాలు రాజకీయాలతో, ముఖ్యంగా ఎన్నికలతో సంబంధం లేకపోతే.. అలాంటి వాటిని వెంటనే విడుదల చేయాలని సూచించింది. జిల్లా గ్రీవెన్స్ కమిటీ నుంచి అనుమతి తీసుకుని.. సామాన్యులు, వ్యాపారుల డబ్బును వీలైనంత త్వరగా.. ఆయా వ్యక్తులు, సంస్థలకు ఇచ్చేయాలని సూచించింది ఈసీ. పట్టుబడుతున్న నగదు, వస్తువుల్లో చాలా వరకు వ్యక్తిగత అవసరాలు, పండుగ షాపింగ్, ఆస్తుల కొనుగోలు, వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి అని.. ఎన్నికలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలకు సంబంధం లేదంటూ చాలా మంది ఎన్నికల సంఘానికి కంప్లయింట్స్ చేస్తున్నారంట.. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం.. అలాంటి వ్యక్తులకు సంబంధించిన డబ్బును.. జిల్లా గ్రీవెన్స్ కమిటీల్లో విచారించి.. అనుమతి పొందిన వెంటనే.. విడుదల చేయాలని రాష్ట్రాల ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

రాజకీయాలు, ఎన్నికలతో సంబంధం లేకుండా పట్టుబడిన సామాన్యులు, వ్యాపారుల డబ్బు పోలింగ్ ముందే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  అయితే తనిఖీల్లో మాత్రం ఇలాంటి వెసలుబాటు ఉండకపోవచ్చు అంటున్నారు అధికారులు. గ్రీవెన్స్ కమిటీల అనుమతి తర్వాత విడుదల ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.