జ్యోతిష్యం : ఈ ఏడాది 2 చంద్ర, 2 సూర్య గ్రహణాలు.. ఏ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..!

జ్యోతిష్యం : ఈ ఏడాది 2 చంద్ర, 2 సూర్య గ్రహణాలు.. ఏ గ్రహణం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం..!

మనదేశంలో సూర్య, చంద్ర గ్రహణాలు అశుభంగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవిస్తాయి. అయితే 2026 లో మొత్తంగా నాలుగు సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ఎప్పుడు రానున్నాయి? ఏ నెలలో అవి సంభవిస్తాయో తెలుసుకుందాం.. మన దేశంపై ఈ  గ్రహణాల ప్రభావం ఉంటుందా? మొదలగు విషయాలనుఈ స్టోరీలో తెలుసుకుందాం..!  

 సూర్య, చంద్ర గ్రహణాలు అంటేనే మనదేశంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధానంగా కొన్ని పనులకు దూరంగా ఉంటారు. 2026 లో మొత్తంగా నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. రెండు  సూర్య, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. 

మొదటి సూర్యగ్రహణం (సంపూర్ణ సూర్యగ్రహణం) :   ఫిబ్రవరి 17 మంగళవారం రోజున ఈ ఏడాది మొదటి  సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.  అయితే, ఇది భారతదేశంలో కనిపించదు. భారత్‌లో గ్రహణం కనిపించదు కాబట్టి, ఇక్కడ సూతక కాల నియమాలు వర్తించవు. శుభకార్యాలు యధావిధిగా నిర్వహించుకోవచ్చు. ఇది పశ్చిమ ఆసియా, నైరుతి యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ , ధ్రువ ప్రాంతాలలో కనిపిస్తుంది.

సూర్యగ్రహణం అంటే ప్రధానంగా ఇది అమావాస్య రోజు ఏర్పడుతుంది. అమావాస్య మంగళవారం కూడా కలిసి వస్తుంది. ఇది కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఆకాశంలో సూర్యుడు చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుంది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు.  

రెండో సూర్యగ్రహణం (కంకణాకృతి సూర్యగ్రహణం) :  ఆగస్టు 12, బుధవారం రోజున  2026 వ సంవత్సరంలో రెండో సూరయగ్రహణం ఏర్పడుతుంది.  ఈ గ్రహణం  హస్తా నక్షత్రం.. కన్యా రాశి లో సంభవిస్తుంది.  ఈ సమయంలో సూర్యుడితో పాటు చంద్రుడు, బుధుడు, కేతువు కలిసి ఉంటారు. దీనివల్ల కన్యా రాశి వారు మరియు హస్త నక్షత్ర జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 

 

►ALSO READ | ఓట్జెంపిక్ అంటే ఏమిటి? బరువు తగ్గించే ఈ 'మ్యాజిక్ డ్రింక్' వెనుక ఉన్న అసలు నిజం ఇదే !

 

ఇది వృత్తాకార సూర్యగ్రహణం అవుతుంది, ఆ సమయంలో చంద్రుడు దూరం కారణంగా చిన్నగా కనిపించి సూర్యుని చుట్టూ అందమైన అగ్ని వలయాన్ని ఏర్పరుస్తాడు. ఇది భారతదేశంలో కనిపించదు. ఇది అమెరికా, దక్షిణ అమెరికా, అర్జెంటీనా మరియు అట్లాంటిక్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

  
 మొదటి చంద్రగ్రహణం:  మార్చి 3వ తేదీ ఏర్పడనుంది. ఇది కూడా మంగళవారం రానుంది ఇది భారత్ లో కూడా కనిపిస్తుంది.  ఆ రోజు సాయంత్రం 6: 26 గంటల నుంచి 6:46 గంటల వరకు మొత్తం 20 నిమిషాలు ఉంటుంది.  భారతదేశంలోని ప్రజలు గ్రహణనియమాలు పాటించాలి.. పట్టు స్నానం.. విడుపు స్నానం చేయాలి.  అనుష్టాన బలం ఉన్నవారు జపం చేసుకోవాలి.  ఇంకా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఉత్తర అమెరికాలో పాక్షిక చంద్రగ్రహణం అవుతుంది.    

 రెండో చంద్రగ్రహణం : ఆగస్టు 28వ తేదీన సంభవిస్తుంది. ఇది భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది. యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ,  సముద్ర ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.