ఓట్జెంపిక్ అంటే ఏమిటి? బరువు తగ్గించే ఈ 'మ్యాజిక్ డ్రింక్' వెనుక ఉన్న అసలు నిజం ఇదే !

 ఓట్జెంపిక్ అంటే ఏమిటి? బరువు తగ్గించే ఈ 'మ్యాజిక్ డ్రింక్' వెనుక ఉన్న అసలు నిజం ఇదే !

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ సహా వాట్సాప్‌లో 'ఓట్జెంపిక్' అనే పేరు మార్మోగిపోతోంది. బరువు తగ్గడానికి వాడే 'ఓజెంపిక్' (Ozempic) అనే కాస్ట్లీ  ఇంజెక్షన్ పేరును కలిసేలా దీనికి ఈ పేరు పెట్టారు. కానీ, దీనికి మందులకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం ఇంట్లో ఓట్స్‌తో తయారు చేసుకునే ఒక పానీయం.

 ఎలా పనిచేస్తుంది: 
ఓట్జెంపిక్ అనేది ఒక అద్భుత పానీయం ఎం కాదు. దీని వెనుక ఉన్న లాజిక్ చాలా సింపుల్... ఓట్స్‌లో 'బీటా-గ్లూకాన్' అనే ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిచేసి, కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించేలా చేస్తుంది. దీనిని ప్రజలు ఉదయం పూట ఎక్కువగా ఖాళీ కడుపుతో తీసుకుంటారు. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల మనం రోజంతా తక్కువ ఆహారం తీసుకుంటాం, తద్వారా బరువు తగ్గుతాం. బరువు తగ్గించే ఇంజెక్షన్లు హార్మోన్ల మీద పనిచేస్తాయి, కానీ ఈ ఓట్ పానీయం కేవలం మీ ఆకలిని కంట్రోల్ చేస్తుంది అంతే.

 ఎలా తయారు చేయాలంటే ?

దీన్ని తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక అర కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకోండి. అందులో తగినన్ని నీళ్లు పోసి  మెత్తగా గ్రైండ్ చేయండి. రుచి కోసం కొంచెం దాల్చిన చెక్క పొడి లేదా కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇందులో పంచదార లేదా తీపి పదార్థాలు అస్సలు కలపకూడదు.

సైన్స్ ఏం చెబుతోందంటే  ? 
దీని గురించి ప్రత్యేకంగా శాస్త్రీయ పరిశోధనలు ఏవీ జరగలేదు. అయితే, ఓట్స్ ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలిసిందే. ఓట్స్‌లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది ఇంకా  పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు ఈ పానీయం తాగి, ఇతర జంక్ ఫుడ్ లేదా ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటేనే బరువు తగ్గుతారు. కేవలం ఈ డ్రింక్ తాగేసి, మిగతావన్నీ తింటే ఫలితం ఉండదు.

►ALSO READ | జ్యోతిష్యం : 2026లో అత్యంత శక్తివంతమైన తేదీలు ఇవే.. ఆ రోజుల్లో పని మొదలుపెడితే విజయమే..!
 
ఇది మందులలాగా నేరుగా కొవ్వును కరిగించదు. అలాగే ఒత్తిడి, నిద్రలేకపోవడం లేదా వ్యాయామం లేకపోవడం వల్ల వచ్చే సమస్యలను  నయం చేయలేదు. ఒకవేళ బరువు తగ్గడం జరిగితే మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గడం వల్ల కావచ్చు. కానీ ఈ పానీయం ప్రత్యేకంగా ఎం చేయదు.