నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి
  •     ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి

ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందుకు వెళ్లడం కరెక్ట్​ కాదన్నారు. ని చెప్పింది. ప్రభుత్వ నిర్ణయంతో నల్లమలలో జీవవైవిధ్యం ధ్వంసం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఈ మేరకు కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్సీ హెచ్ రంగయ్య, జాతీయ సలహాదారు గోపాల్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ఐక్య రాజ్యాసమితి చెబుతుంటే, అందుకు భిన్నంగా ప్రభుత్వం ఆలోచించడం సరికాదన్నారు.