అమీర్ పేట్ లో ఎకనామిక్స్ సెన్సస్ సర్వేపై శిక్షణ

అమీర్ పేట్ లో ఎకనామిక్స్ సెన్సస్ సర్వేపై శిక్షణ

కేంద్రం నిర్వహించే ఏడవ ఆర్థిక గణంకాల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. అమీర్ పేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ హాల్ లో బుధవారం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. జులై నుంచి తెలంగాణలో ఈ సర్వే డోర్ టూ డోర్ నిర్వహించనున్నారు. సర్వేలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి సర్వే మోడల్ గురించి వివరించారు. సర్వేలో అడగాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన పారామీటర్స్ కు సంబంధించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లకు సర్వేలో అంశాలను ఈ సందర్భంగా వివరించారు. ఎకనామిక్ సెన్సస్ సర్వేను కేంద్రం ఐదేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటుంది. గతంలోఈ సర్వేను ప్రభుత్వ ఉద్యోగులు, వీఆర్వోలు డేటా కలెక్ట్ చేసేవారు. ఐతే ఈ ఏడాది నుంచి సీఎస్ఈ అనే సంస్థ ఔట్ సోర్సింగ్ ద్వారా సర్వే చేయిస్తున్నట్లు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు జాతీయాదాయం తెలుస్తుందని ఆయన చెప్పారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది సర్వే ను ఆన్ లైన్ అండ్ మొబైల్ యూప్ ద్వారా నిర్వహిస్తున్నామని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అడిషనల్ డీజీ పీటర్ జాన్సన్ చెప్పారు.  యాప్ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరిస్తామన్నారు.  సీఎస్ఈ సంస్థ చేసే ఈ సర్వేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మానిటర్ చేస్తారన్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే జిల్లా స్థాయి శిక్షణ ప్రారంభిస్తామన్నారు.