మంత్రి గంగుల ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు

మంత్రి గంగుల ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు

రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) దూకుడు పెంచాయి. కరీంనగర్ లోని  ఆరు చోట్ల గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లోఉదయం నుంచి జరుగుతున్న ఈడీ, ఐటీ సోదాలు రాత్రి 8.30 గంటలకు కొలిక్కి వచ్చాయి. తనిఖీలను ముగించుకొని ఒక్కో బృందం హైదరాబాద్ కు బయలుదేరుతోంది.

గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో దాదాపు 10 గంటల పాటు కొనసాగిన సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలోని  మంత్రి గంగుల ఇంటిలో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. మంత్రి గంగుల పీఏ కిషన్ ప్రసాద్ కు  అధికారులు ఓ లెటర్ ఇచ్చి వెళ్లారు. అధికారులు తమ వెంట కీలక డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలను తీసుకెళ్లారు. సోదాలు జరిపిన ఈడీ, ఐటీ టీమ్ లలో  ఎక్కువగా మహిళా అధికారులే ఉన్నారు.  

ఈ సోదాల్లో ముగ్గురు ఐఆర్ఎస్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. గ్రానైట్ రవాణా పన్ను ఎగవేసిన వ్యవహారంలో కరీంనగర్ మంకమ్మతోటలోని శ్వేతా గ్రానైట్స్ ఆఫీస్, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ ఆఫీస్ లో సోదాలు జరిగాయి.మరోవైపు ఇవాళ ఉదయం గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు జరిపింది. హైదరాబాద్ పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సిబ్బంది తనిఖీలు చేశారు.